Vaidrity
Saturday, 20 July 2013
betting on cricket
బంతి యాట పైన పందెంబు సేయ
బొంత ముంత చేను చావిడి యమ్మి
సత్రమును చేరి నగుపాలు నగుదువు
ఇంత చేటు తెచ్చు గోరుగంతులా
bad politician
గురుతు గురుతుగా నీవు గెలిచినావు
గుర్రుతో పదవికి రాజీనామా చేసినావు
భరియింతురు ప్రజలు ఖర్చు భారమను
చిరు చింతయైన లేదురా గోరుగంతులా
cast your vote
వోటుపేరు చెప్పి నోటు అడుగ
నాటు నూ చేర్చె నాయకుఁడు
చేటు తెచ్చునని చరిత్ర చెప్పెరా
చాటి చెప్పవోయీ గోరుగంతులా
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)