Saturday 20 July 2013

betting on cricket

బంతి యాట పైన    పందెంబు   సేయ

బొంత ముంత     చేను చావిడి   యమ్మి

సత్రమును చేరి    నగుపాలు   నగుదువు

ఇంత చేటు తెచ్చు   గోరుగంతులా     

bad politician

గురుతు  గురుతుగా  నీవు  గెలిచినావు

గుర్రుతో  పదవికి  రాజీనామా  చేసినావు

భరియింతురు  ప్రజలు ఖర్చు భారమను

చిరు చింతయైన  లేదురా  గోరుగంతులా 

cast your vote

వోటుపేరు చెప్పి   నోటు అడుగ

నాటు నూ  చేర్చె నాయకుఁడు

చేటు తెచ్చునని  చరిత్ర చెప్పెరా

చాటి చెప్పవోయీ  గోరుగంతులా