Wednesday 27 December 2023

AMRUTAM FUN CONTINUE

                                                సోఫాలో కూర్చుని  టీ వీ చూస్తూ కాఫీ తాగుతున్నాడు  అమృతం . నాన్న బయటకు


 వెళ్తూ అన్న మాటలు చెవిలో గింగిర్లు పెడుతున్నాయి . ఏదో ఆలోచెన తళుక్కుమని మెరెసె . వెంటనే సెల్ ఫోన్ తీసి


 గబగబా ఫొటొలు తీసి ఏదో చేశాడు . నేను సంపాదన లేని  వాడినని చులకన . నేనూ సంపాదించగలనని ఋజువుచేస్తా అని


 మనసులోఅనుకున్నాడు.


                                               గిర్రుమని వారం రోజులు గడిచాయి . అమ్మమ్మ గుడికి వెళ్తూ, ఒరేయ్ బడుద్ధాయ్


తలుపులు వేసుకో జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది. గుళ్ళో సహస్రనామార్చన , కుంకుమపూజా అయ్యేసరికి పదకొండు


గంటలయ్యింది. ప్రసాదం తీసుకుని గబగబా ఇంటికి బయలుదేరింది. రోడ్డుమీద రిక్షాలో సామానులు వెళ్ళటం చూసి


మన వీధిలో ఎవరు ఇల్లు మారుతున్నారు అనుకుంటూ ఇంట్లో అడుగు పెట్టింది.


                                               ఇల్లు అంతా బోసిగా వుంది. అదేమిటి ఇల్లు అంతా ఖాళీగా వుంది? సామాను

ఏమయింది? అనుకుంటుండగానే పెద్దగదిలొంచి టేకు డబల్ కాట్ మంచం నలుగురు సాయంపట్టి బయటకు తెచ్చి


విడగొట్టే ప్రయత్నం చేయసాగేరు. ఏమిట్రా యిది అంటూ అమ్మమ్మ కేక పెట్టేసరికి చేతిలో డబ్బులు లెక్కపెట్టుకుంటో


వచ్చేడు అమృతం
.
                                              ఏమిట్రా యిది ? ఎవరు వీళ్ళు ? ఏం జరుగుతోంది ? సామాన్లు ఎందుకు


పట్టుకెళ్తున్నారు ? అమ్మమ్మ ప్రశ్నల వర్షం. నేను ఎందుకూ పనికిరాని వాణ్ణి అనీ, ఏమీ సంపాదించలేని


వాణ్ణి అనీ అంటున్నారు కదా! అందుకే బకరా డాట్ కం లో అమ్మేసి ఇంట్లో కూర్చుని సంపాదించగలనని ఋజువు


చేశా అని గొప్పలు చెప్పసాగేడు అమృతం.


                                              ఓరి గాడిదా! సంపాదించటం అంటే ఏదో పని చేసి నాలుగు డబ్బులు


పోగేయటం. అంతేగానీ అమ్మి సంపాదించటం అంటే పోగేసినదాన్ని కరిగించటం అని అర్ధం చవట సన్నాసి . మీ నాన్నకి


తెలిస్తే మనిద్దర్నీ ఇంట్లోనించి  వెళ్ళగొడతాడు  అని కేకలు వేసి సామాను అంతా వెనక్కి రప్పించింది.


                                               వీడికి టీ వీ చూసి బుద్ధి మందగిస్తోంది. అందులో ఎర్ర చెడ్డీ వాడికి  డ్రెస్సులో


సమస్య వుంటే మొబైలు అమ్మేయి అన్నాడు. చేతికి దెబ్బ తగిలితే కాలికి కట్టు కట్టినట్టుంది. సమాజం ఎటు


వెళ్తుందో అర్ధం అవటంలేదు. అందుకే వీడికి ఉద్యోగం లేదు పెళ్ళి అవ్వటం లేదు. వీడి వాలకం ఇలా తయారయింది


అనుకుంటూ వంట ప్రయత్నంలో ములిగిపొయింది.  

right religion

హితము      కొరునదియె     మతముగాని

పతనము     చెప్పుననుట     పాడిగాదే

మతముహితము    మానవత్వమే    కదా

గంతులిడి    విను     ఓగోరుగంతులా