Thursday 1 August 2013

FUN

గొడవ  ఎమిటా  అని  బద్ధకంగా    కిటికీలోంచి  తొంగి   చూసాడు  అమృతరావు
మీరు  సంవత్సరానికి   త్రాగే నీరు  వేడి చేసుకోవడానికి  మూడు  సిలిండర్స్  వేస్టు  చేస్తున్నారు.
మరి   దీనీకి  ఉపాయం  ఏమిటి ? ఒకావిడ  ప్రశ్న .
మా  ఫిల్టర్  కొనండి .   మూడు    సిలిండర్స్   ఆదా  చేసుకోండి .  జవాబు
ఆరోగ్యం  గురించి  చేసే  ఖర్చు   దండగ  అంటాడు  ఏమిటి ?  అనుకొన్నాడు  అమృతం .
సంవత్సరానికి   ఎనిమిది   ఫిల్టర్  ఎలిమెంట్స్  కొరకు  నాలుగు వేల  రూపాయలు  ఖర్చు  అవుతోంది
అని   నాన్న  ఫిల్టర్ని   మూల   పడే శారు  కదా .....  అనుకొన్నాడు  అమృతం .  మనకు  ఎందుకు లే
ఈరోజు  చాలా  పనులున్నాయి .       ఓటు  వేయడం  ఒకటి      సాయంకాలం   పెళ్ళిచూపులు  ఒకటి .
గబగబా   తెమిలి    ఓటు    వేయడానికి    పోలింగ్  బూతు కి    వెళ్ళాడు  అమృతం .    అక్కడ  జనం
గుమికూడి   ఉంటేఏమిటి   అని  అడిగాడు ?      ఏముంది    బేలేట్  బాక్స్ లు   ఎవరో  ఎత్తుకు  పోయారు .
సమాధానం .         పోనీలే   వాళ్ళే     కౌంట్  చేసి     ఫలితాలు     చెబుతారు   అని    సర్ది  చెప్పుకుని
ఇంటికి  బయలుదేరేడు ,  సాయంకాలం  పెళ్ళి చూపుల్ని  తలచుకొంటూ

అమ్మాయి  తెములుతోంది .    పలహారాలు  తెచ్చి    టేబుల్  పైన  ఉంచేరు .  అప్పుడే   ఎదురుగా  ఉన్న  Tv  లో
యాడ్   మేము  పురుగులం   వ్యాధులను  వ్యాపింప చేస్తాం  అసహ్యంగా  కమోటు  వగైరాలు .    మా  పినాయలు
వాడండి  వ్యాధులను  అరికట్టండి    చేతితో  కమోటు మీద  రాస్తో .     కడుపులో   చేయ పెట్టి   కెలికినట్టు  అ యెన్ది .
పెళ్ళి చూపులు     అయ్యాయి    అనిపించుకుని    ఇంటికి  బయలు దేరారు .      రిలాక్సు  అవుదామని
కళ్ళు మూసుకున్నాడు .       రాంబాబు   సీఏ  పాస్ అవుతాడా ?        ఎందుకు  అవడు  మా  ఇన్స్టిట్యూట్ లో
జాయిన్  అయితే  తప్పకుండా  సీఏ  అవుతారు .     మన  ఇంట్లో   అంట్లు తోమే   పుల్లమ్మ   ఆ  ఇన్స్టిట్యూట్ లో
అంత  ఫీజులు కట్టి  ఎలా  చదివిస్తుంది  అనుకున్నాడు .     సెల్  మ్రోగడంతో  కళ్ళు నులుముకుంటో  లేచాడు  అమృతం .