Thursday 31 October 2013

Amrutam continue

హల్లో
నేను  పెళ్ళి కూతురు  తండ్రిని 
నేను  అమృతాన్ని చెప్పండి  ఏమిటి  సంగతి ?
మీ  సంబంధం  అన్ని విధాలా  నచ్చింది  కానీ  ఒక  డౌట్
ఏమిటి ?
మీరు  ఓట్స్  తింటారా ?  ప్రశ్న
ఔను  కిర్లిక్స్  ఓట్స్  చాల  ఇష్టం
ఐతే  మీ  సంబంధం  మాకు  ఇష్టం  లేదు
ఎందుకని?
భార్యను  రాత్రంతా  నిద్రపొనీయకుండా  లేపుతూ  మళ్లీ  రేపు  చేస్తావుకదా  అని
వేధిస్తారుట  కదా   అందుకని  ఆ  ఓట్స్  తినేవారి  సంబంధం  మాకు  వద్దు  అని
ఫోన్  కట్  చేశాడు
ఏమిటి  ఇలా  అయింది ? సరే  గురువు గారి  దగ్గరికి  వెళ్ళి చెబుదాం అని  బయటకు
బయలుదేరాడు  అమృతం
ప్రొద్దున్న నుండి   వరండాలో  కుర్చీలో  కూర్చున్న తండ్రిని  ఏం  నాన్నా  ఎవరికోసం
ఎదురు చూస్తున్నావు ? అని  అడిగాడు
ప్రొద్దుట్నుంచి  ఎవరూ  నా  దగ్గరికి  సలహాలగురించి  రాలేదు   ఎవరేనా  వస్తారేమో
అని  చూస్తున్నాను  అన్నాడు  తండ్రి
నువ్వేం  మేధావివి  కాదు  కదా ?   ప్రశ్నించాడు  అమృతం
ఇంటికి   కొరియన్  పెయింట్  వేయించాను  కదా  అందరూ  నన్ను  తెలివైనవాడు  అని
అనుకోవాలి కదా  అన్నాడు  తండ్రి
ఈ వింతధోరణి  ఏమిటో అనుకొంటూ  బయలుదేరాడు  అమృతం
రావయ్యా  అమృతం  చాలా కాలానికి  వచ్చేవు  సంగతి ఏమిటి ? అడిగారు  గురువుగారు
సంగతి  విన్న గురువుగారు  ప్రస్తుతం నీకు  వృషభశార్దూల  యోగం నడుస్తోంది అందువల్ల
ఈసారి అమ్మాయిని డైరెక్ట్ గా చూడకు పెద్ద అద్దం ముందు నుంచోపెట్టి  వెనకాల నుంచి చూడు
సలహా ఇచ్చేడు గురువుగారు  ఈ తికమక ఏమిటో అనుకుంటూ ఇంటి దారి పట్టేడు అమృతం
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి  శనివారం కదా  అమ్మమ్మ టిఫెన్ ఏమిచేసిందో అనుకుంటో డైనింగ్
టేబుల్ చేరాడు
వేడివేడిగా ఉప్మా ప్లేట్లో పెట్టింది అమ్మమ్మ
ఉప్మా వాసన అదోలా వుందేం చెప్మా అనుకుంటో చెంచాతో నోట్లో వేసుకున్నాడు అమృతం
చిత్ర విచిత్రం గా వున్న టేస్టు లోంచి పేస్టు టేస్టు గుర్తించాడు
అదేమిటి అమ్మమ్మా ఉప్మా పేస్టు టేస్టులో వుంది ప్రశ్నించాడు
అదేరా ఉప్మాలో నిమ్మకాయ పిండుదాం అనుకున్నాను
చూస్తే ఇంట్లో నిమ్మకాయ లేదు సాల్ట్ కూడా లేదు
మీ నాన్నని తెమ్మంటే ఎప్పటికి వస్తాడో తెలియదు  ఇంతలో టీవీలో  మన  పేస్టులో నిమ్మకాయ
సాల్ట్ వున్నాయి అని చెప్పడం విన్నాను పోన్లే  అని  అది వేసాను అని సమాధానం ఇచ్చింది అమ్మమ్మ
ప్లేట్ పక్కకు తోసేసి మంచినీళ్ళు తాగి ముసుగు తన్నేడు అమృతం
 

4 comments:

  1. అది కాంప్లిమెంట్ కాదు.. వాళ్ళ సైట్ ప్రమోట్ చేసుకుటున్నాడు.. అన్ని సైట్లలో అల్లానే పెడతాడు..

    మీ కథలు బాగున్నాయి

    ReplyDelete
  2. చాలా బాగుంది

    ReplyDelete
  3. చాలా కాలం తర్వాత అమృతం - ఎన్నికలు చదవండి

    ReplyDelete