షష్టిపూర్తి
షష్టిపూర్తి అవుతోందని సంబరపడిపోత
అరవై వసంతాల డైరీని దుమ్ముదులిపి అందుకున్నా
ఒకటి నుండి పది వరకు తెలిసీ తెలియని వయసు
గోళీలు, గోటిబిళ్ళలు ఆటా పాటా, వీటికి తోడు
అ ఆ లు, ఎ బి సి లు, తల్లీ తండ్రుల మురిపాలు
పదకొండు టు ఇరవై - హైస్కూలు -కాలేజీ
ఎన్ సి సీ - గ్రిక్సు - గేములు స్నేహితులు
సర్వీసు కమీషన్లు - స్తిరపడే ప్రయత్నాలు
ఇరవైఒకటి తో ఆరంభం ముప్ఫై ముగింపు
సర్వీసులు - సతమతాల మధ్య వీచిన సుమంతాలు
మంగళ వాయిద్యాల మధ్య ఒకటైన "దంపతులు "
సినిమాలు-షికార్లు ఆహా! ఎంత మధురమీజీవితం
ముప్ఫై ఒకటి ప్రారంభం ఒకటీ ఒకటీ పెరిగి నలభై వరకు
ప్రమోషన్లు, పిల్లలూ, బాధ్యతలు పెరిగి వటుడింతై
పిల్లల చదువూ-సంధ్యలు వారి భవిష్యత్తుకి అన్వేషణ
నలభైఒకటి నుంచి ఏభై ముగిసేవరకు
అవసరాలమేరకు ఆదాయం సరిపోక
ఓవర్ టైములే కాదు పార్ట్ టైములు కూడా
పిల్లలు అందివస్తారు అదో ఆలంబన
ఏభై ఒకటి ఆద్యం అరవై అంతం వరకు
హమ్మయ్య! పిల్లలు సెటిల్ అవుతున్నారంటే
పెళ్ళిళ్ళు-పేరంటాలు, అనారోగ్యం-ఆసుపత్రి
ఖర్చులు పెరిగాయి. అవసరానికి ఆసరా అని కొన్న
పుత్తడి అమ్మేవరకు ఒత్తిడి తగ్గలేదు.
కొడుకూ-కోడలు, కూతురూ- అల్లుడూ
షష్టిపూర్తి కి మళ్ళీ పెళ్ళి చేద్దాం. ఫోన్లో పిలుపులు
ఉత్సాహం - ఉద్వేగం - సంబరం
బంధువుల ఆగమనం - హడావిడి .
మనవలకోశం ఏం చేసారీయన
ఇరుగు - పొరుగు ల గుసగుసలు
కష్టాలలో బాసటగా నిలిచిన అక్కా - బావలు
అప్పుడే అరవై నిన్డేయిరా! ఆశ్చర్యం
మా కళ్ళకి ఇంకా "రాజా బేటావే" ఆస్శీసులు
అన్నా - ఒదినా, చిన్నా- పెద్దా
అక్షింతలు - అభినందనలు
సుఖీభవ - శుభం భవతు
పదిహేనులో పరిచయమైన
మూర్తీభవించిన మిత్రుడు "మూర్తి"
ఏం చేస్తున్నావ్? వున్నది వూడ్చేశావా?
chala bhagha chepparu
ReplyDeleteGood evening
ReplyDeleteits a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/
your words are very intreasting and truthful.
ReplyDeletehttps://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel.
సరిగ్గా చెప్పారు
ReplyDeleteచాలా కాలం తర్వాత అమృతం- ఎన్నికలు చదవండి
ReplyDeleteఅమృతం వచ్చాడు చాలా కాలం తర్వత
ReplyDelete